ఇసుక అక్రమ రవాణాలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు సిగపట్లు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ఇసుక అక్రమ రవాణాలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారని, ఎవరికి వారు పోటీలు పడి మరీ అందినంత దోచుకుంటున్నారని, పరస్పరం కేసులు పెట్టుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో రాజధానిలో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయని, భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళలు ఎదురుచూస్తున్నారని చంద్రబాబు అన్నారు. సమస్యలను పక్కనపెట్టి సాధింపులపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన మండిపడ్డారు. కంపెనీలన్నీ మూతపడే దుస్థితికి తెస్తున్నారని, యువత ఉపాధి పోగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. అన్ని వర్గాల సమస్యలు సభలో వినిపించాలని, పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ రంగం కుదేలుపై టిడిపి సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/