కేంద్రం పై మండిపడ్డా చంద్రబాబు

విజయవాడ: ఈరోజు విజయవాడలో నిర్వహించిన ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తేలంగాణలో ఎవరైతే కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నారో, వారిని బెరిరించి టీడీపీకి వ్యతిరేకంగా ఉండమంటున్నారని అలా చేయని వారికి నోటీసులు ఇస్తున్నారని ,వారిని వేధింపుల పాలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇలాంటీ విషయాలన్నింటీ పైనా మనం అలోచించుకోవాలని చేప్పారు. వభజన హామీలు నేరవేర్చమని కేంద్రాన్ని అడుగుతుంటే మనలను ఇబ్బందుల పాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.అన్నిశాఖల అధికారులతో దాడులు చేయిస్తున్నారని,అయినా భయపడే ప్రసక్తే లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. న్యాయం జరిగి వరకూ వదిలిపెట్టమని కేంద్రాని మరోసారి హెచ్చరిచ్చారు