ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించిన చంద్రబాబు

విజయవాడ: నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిలుపై విడుదలైన ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే.. ఎక్కువగా ప్రశ్నించారని చంద్రబాబుకు అశోక్‌బాబు తెలిపారు.

కాగా, ఫేక్ సర్టిఫికెట్ ఆరోపణలపై గురువారం(ఫిబ్రవరి 10) సిఐడి అరెస్టు చేసిన అశోక్ బాబుకు విజయవాడ కోర్టు నిన్న రాత్రి బెయిల్ మంజూరు చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/