పార్టీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటి

chandrababu
chandrababu

గుంటూరు: టిడిపి అధినేత చంద్రబాబు ఆపార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటిలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారితో సమస్యను ఎలా పరిష్కరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సమావేశానికి కళా వెంకట్రావు, యనమల, నక్కా ఆనందబాబు, అఖిలప్రియ, అశోక్‌బాబు, గద్దె రామ్మోహన్‌ హాజరయ్యారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/