రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన : చంద్రబాబు

కర్నూలు : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యకర్తల మీటింగ్ కు వేలాదిగా తరలివచ్చిన క్యాడర్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ…. రాష్ట్రంలో ప్రతి ఇంటికి జగన్ బాదుడే బాదుడు రీచ్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ కార్యకర్తలతో సహా అంతా బాదుడే బాదుడు బాధితులుగా వ్యాఖ్యానించారు. కర్నూలు మీటింగ్ చూస్తుంటే మహానాడును తలపించే విధంగా ఉందన్నారు. టీడీపీని కాలగర్భంలో కలపాలి అనుకున్న వారే కనుమరుగు అయ్యారన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించార‌ని అన్నారు.

రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన ఉందన్నారు. ఒకవైపు విధ్వంసం…మరోవైపు బాదుడు…ఇంకో వైపు అప్పులు.. కుప్పలుగా ఉన్నాయన్నారు. టీడీపీ ముందు జగన్ ఒక బచ్చా…..వైస్సార్సీపీ తాటాకుచప్పుళ్లకు టీడీపీకి భయపడ‌ద‌న్నారు. కర్నూలులో టీడీపీ జెండాలు ఎందుకు తొలగించారు… కడప ఎయిర్పోర్ట్ లోకి కార్యకర్తలను ఎందుకు అనుమతించలేదనీ ప్రశ్నించారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరినీ కేసులతో వేధించారన్నారు. బీసీ జనార్థన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టినా కుంగిపోలేదన్నారు. పోరాడిన విషయం గుర్తు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రశ్నే లేదన్నారు. కార్యకర్తలపై కేసులు పెడితే నేను చూసుకుంటా…భయపడాల్సిన పని లేదన్నారు.తప్పుడు లెక్కలకు సీబీఐకి అడ్డంగా దొరికిన జగన్ తనపై మాట్లాడుతాడా అన్నారు. ప్రజలకు పాలనపై ఫ్రస్టేషన్ ఉందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/