ఏపి ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలంటూ లేఖ

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని లేఖలో చంద్రబాబు కోరారు. తమ నేతలకు రాష్ట్ర రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ, కుల ధ్రువీకరణ పత్రాలు అందచేయలేదని ఆయన తెలిపారు. అధికారులు అందుబాటులో లేని కారణంగా వాటిని ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని, ఇందుకు కొందరు పోలీసులు కూడా సహకరించారని ఆయన ఆరోపించారు. చాలా మంది అభ్యర్థులు సకాలంలో నామినేషన్లు చేయలేకపోయారని, దాదాపు 76 ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇందుకు సంబంధించిన ఆధారాలను జతచేసి చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/