‘ఏపీలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లకు పోలీసుల వేధింపులు’

గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ

Chandra Babu's letter to the AP Governor
Chandra Babu’s letter to the AP Governor

Amaravati: తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని , సామాన్య ప్రజలు కూడా వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని , కొందరు పోలీసులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.ఐతె విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటన మరవకముందే.. ఒక ప్రైవేట్‌ ఆస్పత్రి ఉద్యోగినిని పోలీసులు అడ్డగించి వేధించారన్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని చంద్రబాబు కోరారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/