రేపటి నుండి కుప్పం లో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను టీడీపీ నేతలు ఖరారు చేసారు. రేపు (బుధువారం) ఉదయం 9.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 11.20 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ నెల 5న కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
ఇక చంద్రబాబు పర్యటన నిమిత్తం పార్టీ నేతలు గట్టి ఏర్పాట్లు చేసారు. రీసెంట్ గా కందుకూరు , గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించారు. దీంతో ఇలాంటి తప్పిదాలు జరగకుండా పార్టీ నేతలు పక్క ప్రణాళికలతో ఏర్పాటు పూర్తి చేశారు.