ఎన్నికలు సమీపించే సరికి చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారు!

స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు

malladi vishnu
malladi vishnu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ఎన్నికలు ఆపాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంటే స్టేల కోసం టిడిపి కుట్రలు పన్నుతుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే సరికి చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని, టిడిపి హయంలో ఆ వర్గాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై టిడిపి నేతలు చర్చకు సిద్దమా? అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన బాధలో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై కడుపుమంటతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/