కోటి ఖర్చుయే నిర్మాణానికి 9కోట్లు ఖర్చు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అమరావతిలో ఉంటున్న ఇల్లూ అక్రమ కట్టడమేనని వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. లింగమనేని ఎస్టేట్ నుంచి ఆయన తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో కట్టారనే వ్యాఖ్యలతో తప్పించుకోలేరని.. నదీ గర్భంలోని భవనాన్ని కూల్చడం తప్ప మరో పరిష్కారం లేదని పేర్కొన్నారు. ప్రజావేదిక రేకుల షెడ్డులా కనిపిస్తోందని.. సినిమా సెట్టింగుల్లో వాడే పీవోపీనే ఎక్కువగా వాడినట్లు ఉందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రూ.కోటి ఖర్చయ్యే నిర్మాణానికి రూ.9కోట్లు ఖర్చు చూపించారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కట్టినవన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/women/