సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన బాధాకరంః చంద్రబాబు

అగ్నిప్రమాదంలో విజయవాడ వాసి మృతి

chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జి సెల్లార్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మరణించడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

మరోవైపు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో విజయవాడ వాసి మృతి చెందాడు. మృతుడు విజయవాడ రామవరప్పాడుకు చెందిన అల్లాడి హరీష్‌గా గుర్తించారు. ఇటవలే ఈక్విటీఎస్ బ్యాంకులో చేరిన హరీష్… ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో హరీష్ బస చేశాడు. అదే హోటల్‌ కింద ఉన్న ఈ స్కూటర్ల గోదాములో అగ్నిప్రమాదం జరిగి మంటలు పై అంతస్తుకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో హోటల్‌లోనే ఉన్న హరీష్ ప్రాణాలు కోల్పోయాడు. అగ్ని ప్రమాదంలో  హరీష్ చనిపోడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంటెక్ చదివి, ఎంబీఏ చేసిన హరీష్ కొంతకాలం కోస్టల్ బ్యాంకులో పనిచేశాడు. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/