చంద్రబాబు ప్రతిదీ బిజినెస్ మైండ్‌తోనే చుస్తారు
మద్యం ధరలు పెంచినా ఆదాయం పెరగడం లేదని గోల పెడుతున్నారు

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబునాయుడు గోల పెడుతున్నారు. బిజెనైస్ మైండ్ కదా? అలానే ఆలోచిస్తారని అన్నారు. ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చంద్రబాబు నాయుడు చూస్తాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూగారు పేద ప్రజలను తాగడం నుంచి తగ్గించడం కోసమని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారని కావాలంటే మీరూ కూడా నిరభ్యంతరంగా చేరొచ్చు చంద్రబాబు అని విజయసాయిరెడ్డి సూచించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/