చంద్రబాబు వాహనాని అడ్డుకున్న ..కార్యకర్తలు

ఇరు పార్టీల కార్యకర్తల తీరుతో ఉద్రికత

chandrababu
chandrababu

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రోడ్లపై వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల బైఠాయింపు వాహనాల రాకపోకలను అంతరాయం ఎదురవుతోంది. విశాఖ విమానాశ్రయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కారును కొందరు ధ్వంసం చేయడం కలకలం రేపింది. చంద్రబాబు కాన్వాయిని చుట్టుముట్టినవైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు దాన్ని ముందుకు కదలనివ్వట్లేదు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి వద్ద టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/