బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు

పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైస్సార్సీపీ ప్రభుత్వం వేధిస్తోంది: చంద్రబాబు

అమరావతి : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, పోలవరం నిర్వాసితుల్లోని ఆదివాసీలను వైస్సార్సీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. పరిహారం చెల్లించకుండానే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, గిరిజనుల భవితవ్యాన్ని కాలరాస్తోందని తెలిపారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ పథకాలు కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/