ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారు అంటూ వైస్సార్సీపీ కి చంద్రబాబు సూటి ప్రశ్న

ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారు అని వైస్సార్సీపీ కి చంద్రబాబు సూటి ప్రశ్న సంధించారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరిలో పర్యటించారు. ఈ సందర్బంగా వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలపై ఎంత పెనుభారం మోపుతుందో చెప్పేందుకు వచ్చా. వైస్సార్సీపీ పాలనలో ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? జగన్ పాలన మొత్తం అవినీతిమయమైంది. ఈ ప్రభుత్వం నవ రత్నాలు కాదు.. నవ ఘోరాలకు పాల్పడుతోంది. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నాయి. దేశమంతా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఇక్కడ తగ్గించలేదు. తమిళనాడుకు వెళ్లి బైకుల్లో పెట్రోల్‌ నింపుకునే పరిస్థితి వచ్చింది. మద్యం ధరలు విపరీతంగా పెంచారు. మద్యం ధరలు పెంచి.. జగన్‌ వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారు. అయినా.. నాణ్యమైన మద్యం దొరకట్లేదు. రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు. ఈ మద్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిందన్నారు. అలాగే వైస్సార్సీపీ పార్టీకి గౌర‌వాధ్య‌క్షురాలిగా వైఎస్ విజ‌య‌మ్మ రాజీనామాపై చంద్రబాబు స్పందించారు. మొన్న చెల్లి ష‌ర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ వెళ్లిపోయింద‌ని వ్యాఖ్యానించారు.