రాజ్యసభలో రాణించే సత్తా కలిగిన వారు ఏపీలో లేరా?: చంద్రబాబు
ఏపీలో వెనుకబడిన వర్గాల వారు లేరా అంటూ నిలదీత

కడప: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు కడపలో పార్టీ శ్రేణులు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లడుతూ..4 రాజ్యసభ స్థానాలకు వైస్సార్సీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాపై విమర్శలు గుప్పించారు. ఏపీలో రాజ్యసభకు అర్హులైన వారే లేరా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు…ఏపీలో రాజ్యసభలో రాణించే సత్తా కలిగిన వారు లేనట్టు, నాయకులే లేనట్లు, వెనుకబడిన వర్గాల నేతలు లేనట్లు… జగన్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేశారని విమర్శించారు. తనను ప్రశ్నించే వారే లేరన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ తరహా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/