వైఎస్‌ఆర్‌సిపి పై చంద్రబాబు విమర్శలు

కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి వైఎస్‌ఆర్‌సిపి పార్టీ పై విమర్శలు చేశారు.ఒక్క ఓటు కూడా వైఎస్‌ఆర్‌సిపి పడటానికి వీల్లేదని బాబు తెలిపారు. పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేశామని, తూ.గో జిల్లాలో రెండు పంటలకు నీళ్లిచ్చామని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్‌లోపు పోలవరాన్ని పూర్తి చేస్తామని, ఏప్రిల్‌లో పండుగ వాతావరణం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓ పక్క ఎన్నికలు, మరోపక్క పేదలకు డబ్బులు వస్తాయన్నారు. పేదరికంలేని సమాజం తన ఆశయమని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు, ఎల్‌ఈడీ బల నా జీవితంలో ఎప్పుడూ చేయని పనులు ఐదేళ్లలో చేశామని, చేప్పారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: