ఈసీ తీరుపై చంద్రబాబు ఆందోళన

chandrababu
chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ఈసీ తీరుపై ఆందోనళ వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో బిజెపి నేతలు అమిత్‌ షా ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించడం, టీఎంపీ నేతల ఫిర్యాదులను విస్మరించడం ఆందోళన కలిగిస్తుందని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ప్రతి నియోజకవర్గంలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించాలని 22 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కానీ ప్రధాని మోడికి పదే పదే క్లీన్‌చిట్‌లు ఇవ్వడం, బిజెపిచేసిన తప్పుడు ఫిర్యాదులపై కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ప్రతిపక్షాల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నప్పటికీ కావాలనే చర్యలు చేపట్టకపోవడం వంటివన్నీ కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనుమానాలను స్పష్టంగా రేరెత్తిస్తోందన్నారు.


మరిన్ని ఆంధ్రద్రేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/