జగన్‌పై చంద్రబాబు ఫైర్‌

కరోనాను మించిన వైరస్ జగనే..చంద్రబాబు

chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఏపిని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డేనని ఆయన వ్యాఖ్యనించారు. కులం, మతం విద్వేషాలు రగిలించడంలో ఆరితేరినవాడు జగన్. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి మంచివాళ్లపై బురద జల్లడం వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు నిత్యకృత్యంగా మారింది. కేంద్రమంత్రి పేరుతో మోసగించిన వాడితో కేసులు వేయిస్తారు. పేకాట దందాలు నడిపేవాడితో కేసులు వేయిస్తారు. క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారుగ అని సిఎం జగన్‌పై ధ్వజమెత్తారు.

‘ ఇల్లు నా స్వంతం’ , ‘నా స్థలంనాకు ఇవ్వాలి’ అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టిడిపి పిలుపునిచ్చింది. ప్రజా ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలి. లబ్ధిదారులైన పేద కుటుంబాలకు అండగా ఉండాలి. వాళ్ల ఇళ్లు, వాళ్ల స్వాధీనం అయ్యేదాకా బాధితుల తరఫున పోరాడాలి. ‘సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేద కుటుంబం కలగ. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి టిడిపి ప్రభుత్వం కృషి. కట్టిన ఇళ్ల వల్ల టిడిపికి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సిపి పెట్టుకుంది. కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారా? అని పేదలంతా ఎదురు చూస్తున్నారు. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసీపీ నమ్మకద్రోహం చేసింది. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారు..? సంక్రాంతి కల్లా ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలి’అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/