నేడు హైదరాబాద్‌కు రానున్న చంద్రబాబు..టీడీపీ నేతల ర్యాలీ

Chandrababu

న్యూఢిల్లీః టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్ రానున్నారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఆయ‌న బేగంపేట చేరుకోనున్నారు. దీంతో చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లుకుతూ ర్యాలీ నిర్వ‌హించేందుకు తెలంగాణ టీడీపీ నేత‌లు పోలీసుల‌ అనుమ‌తి కోరారు. దీనిలో భాగంగా బేగంపేట నుంచి చంద్ర‌బాబు నివాసం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించేందుకు తెలంగాణ టీడీపీ యోచిస్తోంది.

కాగా, వారి అభ్య‌ర్థ‌న మేర‌కు తెలంగాణ టీడీపీ కార్య‌ర్త‌ల ర్యాలీకి పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. అయితే, ర్యాలీలో 300 మందికి మించి పాల్గొన‌కూడదని పోలీసులు ష‌ర‌తు విధించారు. అలాగే ర్యాలీలో డీజేలు, పేప‌ర్ స్ప్రే గ‌న్స్ వాడొద్ద‌ని సూచించారు. దీంతో సాయంత్రం 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ర్యాలీకి తెలంగాణ టీడీపీ శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నాయి.