ఆర్టీసి ఛార్జీల పెంపుపై చంద్రబాబు నిరసన

chandrababu
chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసి ఛార్జీల పెరుగుదలపై టిడిపి ఆందోళనకు దిగింది. ఫ్లకార్డులు పట్టుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరియు టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఇంకా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మెజార్టీ ఉందని ఇష్టానుసారంగా ఆర్టీసి ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో సభ అభిప్రాయం తీసుకోకుండా ఛార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పెంచిన ఆర్టీసి ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇంకా టిడిపి యువనేత నారాలోకేష్‌ మంగళగిరి నుంచి సచివాలయం బస్టాప్‌ వరకు లోకేష్‌, దీపక్‌ రెడ్డి, అశోక్‌బాబు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఎన్నికలకు ముందు ఏమీ పెంచేది లేదని చెప్పిన జగన్‌ ఇప్పుడు ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అప్పుడు స్వర్గం చూపిస్తామని చెప్పి ఇప్పుడు నరకం చూపిస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై లోకేష్‌ విమర్శలు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/