చంద్రప్రభపై చల్లనిదేవుడు

CHANDRA PRABHA VAHANA SEVA
CHANDRA PRABHA VAHANA SEVA

చంద్రప్రభపై చల్లనిదేవుడు

తిరుమలµ: తిరుమలేశునికి అత్యంతకన్నులపండువగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు మంగళవారంరాత్రి చంద్రప్రభవాహనంపై చల్లనిదేవుడు శ్రీనివాసుడు భక్తులను కరుణించాడు. శ్రీవారికి సూర్యచంద్రులు రెండునేత్రాలు. ఉదయం సూర్యప్రభలో ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి నిశాకరుడైన చంద్రప్రభతోకూడిన వాహనంపై విహరించాడు. చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడై భగవానుడు ఓషధులను పోషిస్తున్నాడని అర్ధం.

చల్లనిదేవరప్రభతో శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చంద్రప్రభవాహనంపై శ్రీవారిని చూడగానే భక్తమానసంభోధులు ఉప్పొంగుతాయి. భక్తనేత్రోత్స వాలు వికసిస్తాయి. అనందం భక్తుల హృదయాల్లో వెల్లివిరిసింది.అంతకుముందు సాయంత్రం నిత్యకైంకార్యలు పూర్తిచేసుకున్న తరువాత ఆలయంనుంచి మలయప్పస్వామిని వాహనమండపం వద్దకు వేంచేపుచేశారు. కర్పూరహారతులిచ్చి రాత్రి వాహనం ఆలయమాఢవీధుల్లో ప్రదక్షణగా బయలుదేరింది.ఈ వాహనసేవలో జియ్యర్‌స్వాములు, టిటిడి ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌, తిరు మల జెఇవో కెఎస్‌ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఇవో పి,హరీంధ్రనాథ్‌, ఇన్‌ఛార్జి సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.