రేపు హస్తినలో చంద్రబాబు విపక్షాలతో ధర్నా

chandrababu naidu
chandrababu naidu, ap cm

అమరావతి: సోమవారం నాడు మధ్యాహ్నం ఏపి సియం చంద్రబాబునాయుడు బెంగాల్‌ సియంతో మమత బెనర్జీతో భేటీ కానున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో భవిష్యత్‌ ప్రణాళికపై ఆమెతో చర్చించేందుకు అమరావతి నుండి బెంగాల్‌కు వెళ్లనున్నారు. మంగళవారం నాడు విపక్ష పార్టీలతో భేటి కానున్నారు. హస్తిన వేదికగా ఎన్నికల సంఘంపై, కేంద్ర సర్కార్‌పై పోరుకు సిద్ధం కావాలని, అందరూ కలిసి రావాలని చంద్రబాబు విపక్ష పార్టీలను కోరనున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నా చెయ్యాలని ఏపి సియం చంద్రబాబు సంకల్పించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవిఎంల పనితీరు, వివి ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని మోది అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఉదయం టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా పోరుబాట పట్టారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/