కేసీఆర్‌ని ప్రశ్నించిన? : బాబు

chandra babu naidu
chandra babu naidu

హైదరాబాద్‌ ప్రభాతవార్త :కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రగతి బవన్‌ కట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తానంటే, మూడెకరాల భూమి ఇస్తానంటే, తెలంగాణను అభివృద్ధి చేన్తుంటే అడ్డుపడ్డానా అని ప్రశ్నించారు తెలుగుజాతి కోసం పోరాడే శక్తి తనకే ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో రెండే ఫ్రంట్‌లు ఉన్నాయన్నారు. ఒకటి బీజేపీ… రెండోది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఏ ఫ్రంట్‌లో ఉన్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.