సిఈసితో ఏపి సియం చంద్రబాబు భేటి

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌(సిఈసి) సునీల్‌ అరోరాతో టిడిపి జాతీయ అధ్యక్షుడు ,ఏపి సియం చంద్రబాబు భేటి అయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్‌ వ్యవహారాన్ని ఈసి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రీపోలింగ్‌కు సిఈసి ఆదేశాల వెనక కారణాలేంటని, రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చే ముందు ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఎన్నికలు పైర్తైన చాలా రోజు తర్వాత సీఈసి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాన్ని ఆయన ప్రధానంగా అడిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/