పోలింగ్‌లో లోపాలపై సిఈసికి చంద్రబాబు ఫిర్యాదు

sunil arora, chandra babu naidu
sunil arora, chandra babu naidu


న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తూ ఏపి సియం చంద్రబాబు సీఈసికి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం సిఈసి సునీల్‌ అరోరాను కలిశారు. రాష్ట్రంలో పోలింగ్‌ జరిగిన తీరు, ఈవిఎంలలో తలెత్తిన లోపాలపై ఫిర్యాదు చేశారు. కొన్ని నియోజక వర్గాలలో రీపోలింగ్‌ పెట్టమని కోరారు. చంద్రబాబు సహా 20 మంది సభ్యుల బృందం ఈసిని కలిసింది. ఈసి తీరు, ఈవిఎంల పనితీరుపై జాతీయస్థాయిలో ఉద్యమించాలని చంద్రబాబు నిర్ణయించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/