ఉపేంద్ర సరసన ఛాన్స్

Kajal agarwal

కాజల్ అగర్వాల్  ప్రస్తుతం విశ్వ నటుడు కమల్ హాసన సరసన ఇండియన్-2 లో నటిస్తోంది. అయితే సౌత్ లో కన్నడ-మలయాళ రంగాలతో కాజల్ కి అస్సలు టచ్ లేదు. అందుకే ఇకపై ఈ రెండు భాషల్లోనూ నటించాలని డిసైడైందట. తొలిగా కన్నడ భాష పై దృష్టి సారించిందని తెలుస్తోంది. కన్నడ- తెలుగు రంగాల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న ఉపేంద్ర సరసన ఛాన్స్ అందుకుంది. కబ్జా అనేది టైటిల్. ఇది కూడా ఉపేంద్ర శైలిలో రా అండ్ రస్టిక్ కంటెంట్ ఉన్న సినిమా. కాజల్ కి కూడా ఉప్పీ నుంచి టార్చర్ తప్పదట. అతడు నటించిన ఏ.. ఉపేంద్ర లాంటి చిత్రాల్లానే కొంచెం హార్డ్ గానే ఉంటుందట. అయినా ఉపేంద్ర సరసన అవకాశాన్ని కాదన లేకపోయిందట. కాజల్ నటిస్తున్న మోసగాళ్లు చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది. 

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/