భారత్ పై ఆస్ట్రేలియా విజయం

HOCKEY
HOCKEY

చాంఫియన్స్ ట్రోఫీ హాకీ ఫోటీల్లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా చాంఫియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ తో ఆస్ట్రేలియా గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కలలు కన్న భారత హాకీ జట్టు ఆశలకు ఆస్ట్రేలియా గండికొట్టింది.  ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఆఖరి పోరులో భారత్ 1-2 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆరంభం నుంచి హోరాహోరీగా తలపడ్డాయి. తొలి హాఫ్ టైం ముగియడానికి 6 నిమిషాల ముందు గొవెర్స్ ఒక గోల్ చేసి ఆస్ట్రేలియాను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత రెండో హాఫ్‌ ఆరంభంలో భారత్‌కు ఓ పెనాల్టీ వచ్చినా గోల్ సాధించలేకపోయింది. కానీ 43 నిమిషాల వద్ద వివేక్ సాగర్ అద్భుతమైన గోల్ సాధించి భారత్ ఖాతాని తెరిచాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు (1-1) సమం అయ్యాయి. మ్యాచ్ ముగిసే సమయం వరకు కూడా ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే విజేత ఎవరనికి నిర్ణయించేందుకు షూట్ ఔట్‌ని నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా ఆరంభంలోనే గోల్‌ సాధించింది. ఆ తర్వాత