చామంతి టీ

Chanmanti Tea

గ్రీన్‌ టీ లే కాదు పూతేనీటి వాడకమూ పెరిగింది. వాటిల్లో ముఖ్యంగా చామంతి టీని ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగపరచుకోవాడానికి ఉపయోగిస్తునఆనరు. చామంటి టీని ముఖానికి రాసుకుని ఆరనిస్తే ఇది చర్మాన్ని చాలా తక్కువ సమయంలో తాజాగా మారుస్తుంది. దీనిలోని పోషకాలు చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లను ఈ టీ తగ్గిస్తుంది. చర్మంపై పేరుకున్న నలుపు ముఖాన్ని కాంతివిహీనంగా మారుస్తుంది. అలాంటి వారు రోజు విడిచి రోజు చామంతి టీని ముఖానికి రాసుకోవాలి.

ఇది సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. చర్మఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుంది. చర్మం బిగుతుగా మారుతుంది. ఫలితంగా నలుపే కాదు. ముఖంపై ఏర్పడే మచ్చలూ తగ్గుతాయి.

నిద్రలేమి, పని ఒత్తిడి ఇతరత్రా కారణాలల్లో కళ్లు వాస్తాయి. అటువంటప్పుడు చల్లని చామంతి టీలో దూదిని ముంచి కనురెప్పలపై ఉంచితే సమస్య దూరమవుతుంది. కంటి అలసటా తగ్గుతుంది. నల్లని వలయాలు దూరమవుతాయి. నాలుగు చెంచాల గోరింటాకు పొడికి చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరువాత తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. జుట్టుకి పోషణ అందుతుంది. పట్టులా మారుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/