5న ‘ఛలో ఢిల్లీ’ పిలుపు

DELHI
DELHI

5న ‘ఛలో ఢిల్లీ’ పిలుపు

విజయవాఢ: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సిపిఎస్‌) రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని కోరుతూ ఆల్‌ఇండియా ఉద్యోగ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు సెప్టెంబర్‌ 5న నిర్వహించే ఛలో ఢిల్లీకి జిల్లానుండి భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని ఏపి ఎన్‌జిఓ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. గాంధినగర్‌ ఎన్‌జిఓ హోంలో ఆయన అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై తాము పోరాడుతున్నామన్నారు. దీన్ని మరింత తీవ్రతరం చేయడానికి ఛలోఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ నిరసనల్లో భాగంగా సెప్టెంబర్‌ 1న అన్ని కలెక్టరేట్ల ముందు ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో పికెటింగ్‌ చేస్తామన్నారు.

అక్టోబర్‌ 23న దేశవ్యాప్తంగా అన్ని రాజ్‌భవన్ల ముందు ఆందోళన చేయాలని ఆల్‌ఇండియా ఉద్యోగ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు తాము ఆందోళన చేస్తామన్నారు. విజయవాడలో రాజధానిలో రాజ్‌భవన్‌ లేనందున ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ 15న దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా సమైఖ్యంగా ఒక రోజు సమ్మెకు దిగుతామన్నారు.