ఏపీలో మరో భారీ సంస్థ పెట్టుబడి ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సెంచురీ ప్లై ముందుకొచ్చింది. వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయబోతుంది. బుధువారం సీఎం క్యాంప్ ఆఫీసులో సెంచురీ ప్లై బోర్డ్స్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు..జగన్ తో సమావేశయ్యారు. ప్లైవుడ్, బ్లాక్‌ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్, పార్టికల్‌ బోర్డ్‌ల తయారీలో దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తుంపు ఉన్న సెంచురీ ప్లై బద్వేల్‌లో భారీ పెట్టుబడి పెట్టడం సంతోషంగా భావిస్తున్నారు.

తొలి దశ పనులను తక్షణం ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ భావిస్తుంది. మొదటి దశలో 4 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను పూర్తి చేసి 2024 నాటికి 10 లక్షల టన్నులకు తీసుకెళ్లాలనే లక్ష్యం తో సంస్థ ఉంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు జగన్ కు వివరించారు.