రాష్ట్రాలకు కేంద్రం లేఖ

వలస కార్మికుల కోసం మరిన్ని శ్రామిక్‌ రైళ్లను నడపాలి

migrant-workers

న్యూఢిల్లీ: వలస కార్మికుల వారి స్వస్థలాలకు చేర్చేందుకు మరిన్ని శ్రామిక్‌ రైళ్లను నడపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ఈక్రమంలో మహిళలు, పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనికోరింది. కరోనా మహమ్మారి, జీవనోపాధి కోల్పోతున్నామన్న ఆందోళనల కారణంగానే వలసకార్మికులు తమ సొంత గ్రామాలకు చేరుకునేందుకు యత్నిస్తున్నారని హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలు, రైల్వేలు సమన్వయంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని, వారికి మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. ఆహారం, ఆశ్రయం, శానిటైజేషన్‌, క్వారంటైన్‌ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని లేఖలో పేర్కొన్నారు. కాలినడకన వెళ్లే వలసదారులకు జిల్లా అధికారులు రవాణాసౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వారిని బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లకు తరలించాలని అన్నారు. వారి చిరునామాలను తీసుకోవడంతో కరోనా ట్రేసింగ్‌కు సహాయపడగలదని భల్లా సూచించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/