తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్..

వరి కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత కొద్దీ రోజులుగా తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నట్లే.. యాసంగి కాలంలో వరి పంట వేయకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వరి కొనుగోలు విషయంలో తెలంగాణ మంత్రులు ఢిల్లీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి తో వరి వేయడంపై స్పష్టత ఇచ్చారు.

యాసంగిలో వరి వేయొద్దన్న కేంద్రం.. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. దీనిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…వరి పంట పై నిరాశే మిగిలింది… యాసంగి వేయద్దని కేంద్ర మంత్రి స్పష్టం చేశారన్నారు. ఓ ఏడాది లో ఎంత మేరకు ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పాలని కోరాం. అది చెప్పే అవకాశం లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారన్నారు. కేంద్రం ఆదేశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి… వివరిస్తామని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మరి ఈ చేదు వార్తను రైతులు ఎలా తట్టుకుంటారో.. మరి ఇప్పటి పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తుందో ప్రభుత్వం అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.