గవర్నర్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్‌ భేటీ

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ

Dharmendra-pradhan- Biswabhusan Harichandan
Dharmendra-pradhan- Biswabhusan Harichandan

అమరావతి: కేంద్ర ఇంధన, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఈరోజు ఉదయం అమరావతి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బిజెపి నాయకులు మాణిక్యాలరావు, ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ మంత్రిని కోరారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పరిధిలో గ్యాస్‌ నిక్షేపాలు వెలికి తీసే ప్రాంతాన ఏర్పాటుచేసిన ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ఈరోజు ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రారంభించనున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/