వరి కొనుగోలు విషయంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై తెరాస సర్కార్ వరి యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఢిల్లీ లో భారీ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని , కేంద్రం ఫై నిప్పులు చెరిగారు. 24 గంటల్లో వరి కొనుగోలు ఫై ప్రకటన చేయాలనీ డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో వరి కొనుగోలు ఫై కేంద్రం పలు వ్యాఖ్యలు చేసింది.

“దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉంది. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎంత అవసరమో అంతే తీసుకుంటాం.. ఎవరిపైనా వివక్ష లేదు. తెలంగాణలో గత ఐదేళ్లలో 7 రెట్ల ధాన్యం సేకరణ చేశాం. ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. పంజాబ్‌ నుంచి పారా బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేదు’’ అని తెలిపింది. పారా బాయిల్డ్‌ రైస్‌కి డిమాండ్‌ లేదన్నారు. రా రైస్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని , తెలంగాణ ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తి ఎంత అవుతుంది.? ఎంతమేర ఇస్తారనేది స్పష్టంగా చెప్పలేదన్నారు ఎఫ్‌సీఐ రిజనల్‌ మేనేజర్‌ దీపక్‌ శర్మ.