మ‌న క్షిప‌ణుల వ్య‌వ‌స్థ అత్యంత సుర‌క్షితం, న‌మ్మ‌ద‌గింది : రాజ్‌నాథ్ సింగ్

ప్ర‌మాద‌వ‌శాత్తు మిస్సైల్ దూసుకెళ్లింది..పాకిస్థాన్‌లో భార‌త‌ క్షిపణి ప‌డ‌డం ప‌ట్ల పార్ల‌మెంటులో రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న‌

central-government-on-accidental-firing-indo-pak

న్యూఢిల్లీ: ఇటీవ‌లే భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి పాకిస్థాన్‌ భూభాగంలో పడిన విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే భార‌త్‌, పాకిస్థాన్ స్పందించాయి. దీనిపై నేడు రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నెల 9న ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌న‌ మిస్సైల్ ఒక‌టి పాకిస్థాన్‌లో ప‌డిన‌ట్లు తెలిపారు. సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌యోగాల‌ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెప్పారు. ప్ర‌మాద‌వ‌శాత్తు మిస్సైల్ దూసుకెళ్లిన అనంత‌రం అది పాకిస్థాన్‌లో ప‌డిన‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు. పాక్‌లో అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు.

తాము ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌నపై అత్యున్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించామ‌ని వివ‌రించారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆయుధ వ్య‌వ‌స్థ‌కు ప్రాధాన్యం ఇస్తోంద‌ని తెలిపారు. మ‌న క్షిప‌ణుల వ్య‌వ‌స్థ అత్యంత సుర‌క్షితం, న‌మ్మ‌ద‌గింద‌ని తెలిపారు. మ‌న నిపుణుల ప్ర‌మేయం లేకుండానే ఆ క్షిప‌ణి వెళ్లింద‌ని చెప్పారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు స‌రికావ‌ని తెలిపారు. విచార‌ణ అనంత‌రం ఇందుకు సంబంధించిన‌ కార‌ణం తెలుస్తుంద‌ని అన్నారు. భార‌త‌ సైనిక బ‌ల‌గాలు సైతం చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్నాయ‌ని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/