విదేశాల్లో పెరుగుతున్నకరోనా కేసులు ..రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

New corona virus strain
corona virus

న్యూఢిల్లీః చైనా, అమెరికా, తదితర దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త వేరియంట్లను ట్రాక్ చెయ్యాలని, ఇందుకోసం పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని సూచించింది. కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ రాజేశ్ భూషణ్ మంగళవారం అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాశారు.

జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచితేనే కొత్త వేరియంట్లను సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతుందని సూచించారు. కాగా, మన దేశంలో మంగళవారం ఉదయం 112 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 3,490 ఉన్నాయని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మరోవైపు, దేశంలో కరోనా సిచువేషన్​పై బుధవారం కేంద్ర మంత్రి మాండవీయ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/