కేంద్ర కేబినెట్‌ కీలక సమావేశం

కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ ప్రభావంపై చర్చలు

PM Modi At Union Cabinet Meeting
PM Modi At Union Cabinet Meeting

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా పై ప్రధాని మోడి నేతృత్వంలో ఆయన నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటి అయింది. కరోనాపై బినెట్‌లో కీలక చర్చలు జరుపుతున్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ ప్రభావం, దేశ ఆర్థిక స్థితి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మోడికి కేంద్ర మంత్రులు సూచనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై కూడా వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీపై కూడా మోడి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ భేటీకి ముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఇందులో పలు ప్రతిపాదనలు చేసింది.. వాటిని ప్రధాని మోడి కి వివరిస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/