కరోనా వైరస్‌ను విపత్తుగా ప్రకటించిన కేంద్రం

రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అప్రమత్తమైన రాష్ట్రాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా.. షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లను మూసివేశాయి. వైరస్‌ బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో.. కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్‌19 ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 5423 మంది కరోనా కారణంతో మృతి చెందారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/