ఏపీలో మీడియం మార్పుపై జోక్యం చేసుకోండి

రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీలు కనకమేడల, జీవీఎల్‌

gvl narasimha rao & kanakamedala
gvl narasimha rao & kanakamedala

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ జగన్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని టిడిపి సభ్యుడు కనకమేడల రవీందర్‌, బిజెపి సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు కోరారు. రాజ్యసభలో శూన్యగంట సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారు కూడా ఆ తర్వాతా ఇంగ్లీష్‌ మీడియాంలో ప్రావీణ్యం పొందారని సభకు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగు సూచనలు చేయాలని జీవీఎల్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవరించుకునేలా కేంద్రం ఆదేశాలివ్వాలని టిడిపి ఎంపీ కనకమేడల కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/