దేశంలో మంకీపాక్స్‌ కేసులు..కేంద్రం అత్యవసర సమావేశం

center-holds-meeting-of-experts-to-discuss-monkeypox-management-begins

న్యూఢిల్లీః మంకీపాక్స్‌ దేశంలో విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్‌ మేనేజ్‌మెంట్‌ గైడెలైన్స్‌ను సవరించేందుకు గురువారం ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమరెన్జీ మెడికల్‌ రిలీఫ్‌ డైరెక్టర్‌ ఎల్‌ స్వస్తి చరణ్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నది.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైసెన్స్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సైతం భేటీకి హాజరయ్యారు. ఈఎంఆర్‌ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలో ఓ విభాగం. ఇది జాతీయ, అంతర్జాతీయంగా ప్రజారోగ్య విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గైడెల్స్‌ను సవరించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం ఢిల్లీలో నైజీరియాకు చెందిన 31 సంవత్సరాల మహిళకు మంకీపాక్స్‌ నిర్ధారణైన విషయం తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/