Auto Draft
బలపడిన సెంటిమెంట్

ముంబై: దేశీయ మార్కెట్లో మంగళవారం సిమెంట్ షేర్లు జోరందుకున్నాయి. కొవిడ్-19కు విధించిన లాక్డౌన్ల నుంచి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటపట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సిమెంట్ రంగ కంపెనీలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
దీంతో ఈ షేర్లు ప్రస్తుతం ఎన్ఎస్ఇలో ఎసిసి సిమెంట్ 6.25శాతం పెరిగి రూ.1677వద్ద ట్రేడవుతోంది. శ్రీసిమెంట్ షేరు 6.7శాతం పెరిగి రూ.21,780వద్ద ట్రేడవుతోంది.
ఇక అల్ట్రాటెక్ సిమెంట్ మూడు శాతం పెరిగి రూ.4623వద్ద కదులుతోంది. రామ్కో సిమెంట్స్ 3.4శాతం పెరిగి రూ.781కి చేరింది.
ఇంట్రాడేలో రూ.782కి చేరింది. మంగళం సిమెంట్ కూడా 4.25శాతం పుంజుకొని రూ.205వద్ద ట్రేడవుతోంది.
డెక్కన్ సిమెంట్స్ 2.6శాతం పెరిగి రూ.325వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.330కి చేరింది. శ్రీ దిగ్విజ§్ు మూడు శాతానికిపైగా వృద్ధితో రూ.66వద్ద ట్రేడవుతోంది.
ఇదే విధంగా ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ కూడా ఒకశాతం చొప్పున పుంజుకున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/