రంజాన్ ప్రార్ధనలు ఇళ్లలోనే జరుపుకోండి
మత పెద్దలతో ఏపి సిఎం వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: రంజాన్ మాస నెలారంభం నుంచి ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు, ప్రార్ధనలను ఉద్ధేశించి నేడు ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా రంజాన్ మాసంలో ప్రార్ధనలు ఇళ్లలోనే జరుపుకోవాలని సిఎం సూచించారు. ఈ సంవత్సరం ఉగాది, గుడ్‌ఫ్రైడే, శ్రీరామనవమి,ఈస్టర్ వంటి పండుగలు కూడా ప్రజలు ఇళ్లలోనే జరుపుకున్నారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలో ప్రార్ధనలు జరుపుకునేలా అందరికి చెప్పాలని జగన్ కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/