సియట్‌ టైర్స్‌ నుండి ఎన్‌95 మాస్కు విడుదల

ఈ మాస్కుల ధర రూ.249

CEAT-Tyres-Launches-GoSafe-S95-Face-Masks-In-India

ముంబయి: ప్రముఖ టైర్ల కంపెనీ సియట్‌ కొత్తగా ఎన్‌95 మాస్కులను విడుదల చేసింది. చాలా వరకు ఆటోపరిశ్రమలు వెంటిలేటర్లు, పీపీఈ కెట్లు వంటి పరికరాలను తయారు చేస్తున్నాయి. తాజాగా వాటిల్లో సియట్‌ కూడా చేరింది. ఎన్‌95 మాస్కులను నేడు మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాస్కుకు గోసేఫ్‌ ఎన్‌95 మాస్క్‌ అని పేరుపెట్టింది. దీని లోపలి భాగాన్ని యాంటీబ్యాక్టీరియల్‌ వస్ర్తంతో తయారు చేశారు. దీని ధర రూ.249గా నిర్ణయించారు. సియట్‌ కంపెనీకు చెందిన దుకాణాల్లో ఈ మాస్కులు అందుబాటులో ఉంటాయి. మాస్కు విడుదల సందర్భంగా సియట్‌ టైర్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ టొలానీ మాట్లాడుతూ సేఫ్టీ ఫస్ట్‌ అనే సిద్ధాంతానికి అనుగుణంగా మేము ఈ మాస్కును తయారు చేశామని తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుక మా వంతు సాయంగా దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు. కాగా ఈ మాస్కులను భద్రపర్చుకోవడానికి ప్రత్యేకమైన వస్త్రంతో సంచీ కూడా వస్తుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/