దివంగత సిడిఎస్ బిపిన్ రావత్ కి పద్మ విభూషణ్

న్యూఢిల్లీ: ఈ నెల 21న దేశపు తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం పద్మ విభూషణ్ ని ప్రకటించింది. ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 21న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బిపిన్ కుమార్తెలు కృతిక, తారిణి ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. పద్మ అవార్డులను ఈ ఏడాది మార్చి 21, 28 తేదీల్లో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. జనవరి 26న , 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. వీరిలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు.
కాగా, గతేడాది డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ రావత్ మరణించారు. పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పౌర పురస్కారం అని తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/