ఆత్మహత్య చేసుకున్న సిసిఎస్ ఎస్ఐ

హైదరాబాద్: నగరంలోని సిసిఎస్‌లోని ఎస్ఐ సైదులు ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిసిఎస్‌లో ఎస్ఐగా విధుల నిర్వహిస్తున్న సైదులు తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబలోని కలహాల కారణంగానే ఈ దారుణానికి పూనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సైదులు మృతితో సిసిఎస్ కార్యాలయంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల సహచరులు దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా వ్యవహరించే సైదులు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/