సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ : సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ( CBSE ) 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం సీబీఎస్‌ఈ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. అలాగే విద్యార్థులు cbse.gov.in, cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చని పేర్కొంది. ఫలితాల మార్క్‌ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇంటర్నల్స్‌, యూనిట్‌ టెస్ట్స్‌, మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.

కాగా, CBSE పూర్తిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా ఫ‌లితాలు వెల్ల‌డించ‌డం ఇదే మొద‌టిసారి. ఫ‌లితాల కోసం విద్యార్థులు cbse.nic.in, cbse results.nic.in వెబ్‌సైట్‌ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సీబీఎస్ఈ సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/