సిబిఐ విచారణకు ‘గాలి అక్రమ మైనింగ్‌ కేసు

gali janardhan reddy
gali janardhan reddy

బెంగుళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధరెడ్డికి సంబంధించి 2013లో అక్రమ మైనింగ్‌ కేసు విచారణ చేసిన సిబిఐ ఐపిఎస్‌ సెక్షన కింద విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని గాలి జనార్ధన్‌రెడ్డి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్టీ విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం 2018 సెప్టెంబరు 18న జనార్ధన్‌రెడ్డికి అనుకూలంగా స్టే ఇచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ప్రశ్నిస్తూ సిబిఐ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఇదే కేసులో సాక్షులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇలాంటి సమయాల్లో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ నుంచి మినహాయించడం, కొత్తగా పేర్లు చేర్చడం వంటి అధికారాలు ప్రత్యేక న్యాయస్థానానికి లేవని సిబిఐ తరపు న్యాయవాది హైకోర్టులో చెప్పారు. గాలి జనార్ధనరెడ్డి మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 409 విశ్వాస ద్రోహం కింద కేసు నమోదయింది. ఈ సెక్షన్‌ కింద విచారణ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలకు సెప్టెంబర్‌లో హైకోర్టు స్టే ఇచ్చింది. తరువాత సెక్షన్‌ 409 కింద విచారణ చేయడానికి హైకోర్టు ఏకసభ్య బెంచ్‌కు ్గగ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/