సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట

బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసిన కోర్టు


హైదరాబాద్: సీబీఐ కోర్టులో సీఎం జగన్ తో పాటు పార్లమెంటుసభ్యులు విజయ సాయిరెడ్డికి ఊరట లభించింది. సీఎం జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ను తిరిస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సైతం తిరస్కరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు సైతం ఇవాళ కొట్టివేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/