మాజీ ఐపిఎస్‌ ఇంట్లో సిబిఐ సోదాలు

CBI
CBI


బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్‌, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి అలోక్‌కుమార్‌ ఇంటిలో సిబిఐ దాడులు నిర్వహించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఐపిఎస్‌ అధికారి అలోక్‌కుమార్‌కు చుట్టుకుంది. హెచ్‌డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌గా అలోక్‌కుమార్‌ పనిచేశారు. ఆ సమయంలో అనేక మంద్రి రాజకీయ నాయకులు, చలనచిత్ర నటులు, బిజెపి నేతల ఫోన్లు ట్యాపింగ్‌ అయ్యాయన్న ఆరోపణలు రావడంతో ఈ కేసు బిజెపి ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. దాంతో ఈ కేసుకు సంబంధించి అనేక మంది పోలీసు అధికారులను విచారణ చేసిన సిబిఐ అధికారులు అలోక్‌కుమార్‌ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అలోక్‌కుమార్‌ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు. బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారన్న విషయం కూడా బయటికి వచ్చింది. నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ నాయకుడితో మాట్లాడుతుండగా ఫోన్‌ ట్యాపింగ్‌ అయ్యిందని విషయం వెల్లడి కావడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అలోక్‌కుమార్‌కు సంబంధముందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడుగోడిలోని టక్నికల్‌ విభాగం నుంచి ఫోన్‌ ట్యాపింగ జరిగిందని, ఆ పెన్‌డ్రైవ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇచ్చారని సిబిఐ అధికారులు అంటున్నారు. కుమారస్వామి సిఎంగా ఉన్నప్పుడు అప్పటి పోలీస్‌కమిషనర్‌ అలోక్‌కుమార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/